AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IOCL Admit Card 2021: ఇండియన్‌ ఆయిల్‌ ఉద్యోగాల కోసం అప్లై చేశారా.. హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..?

IOCL Admit Card 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ రిఫైనరీ / పెట్రోకెమికల్ యూనిట్లలో నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్

IOCL Admit Card 2021: ఇండియన్‌ ఆయిల్‌ ఉద్యోగాల కోసం అప్లై చేశారా.. హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..?
Iocl Recruitment 2021
uppula Raju
|

Updated on: Oct 20, 2021 | 4:52 PM

Share

IOCL Admit Card 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ రిఫైనరీ / పెట్రోకెమికల్ యూనిట్లలో నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డును విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iocl.com ని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ 25 సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభమైంది. ఇందులో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి 12 అక్టోబర్ 2021 సాయంత్రం 5:00 గంటల వరకు సమయం కేటాయించారు. మొత్తం 513 పోస్టులు భర్తీ చేస్తారు. ఇప్పుడు ఈ పోస్టుల అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దీనితో పాటు పరీక్ష తేదీలు కూడా ప్రకటించారు. 24 అక్టోబర్ 2021 న పరీక్ష నిర్వహిస్తారు.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేయడం ఎలా..? 1. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్- iocl.com ని సందర్శించండి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో న్యూ క్లిక్ చేయండి. 3. ఇప్పుడు కెరీర్ లింక్‌కి వెళ్లండి. 4. ఇక్కడ నాన్-ఎగ్జిక్యూటివ్స్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి. 5. దీనిలో అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి క్లిక్ చేయండి 6. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేయాలి 7. అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. 8. డౌన్‌లోడ్ చేయండి తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు1 సంవత్సరం అనుభవం ఉన్న ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి B.Sc డిగ్రీని కలిగి ఉండాలి. అదే సమయంలో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒకరు ITM సర్టిఫికేట్ లేదా PCM లో B.Sc డిగ్రీని కలిగి ఉండాలి.

తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Keerthy Suresh: ఇక పై అలాంటి సినిమాలు చేయనంటున్న ముద్దుగుమ్మ.. సంచలన నిర్ణయం తీసుకున్న కీర్తిసురేష్..

Smart Phones: ఈ 4 కంపెనీల స్మార్ట్‌ఫోన్స్‌ కేవలం రూ.1000లకే కొనుగోలు చేయొచ్చు..! ఎలాగంటే..