National Board of Examinations: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) ఇన్ మెడికల్ సైన్సెస్‌లో వివిధ ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 42
ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ అసిస్టెంట్ 30, జూనియర్ అకౌంటెంట్ 4 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత : ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌బీఈ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ బేసిక్ సాఫ్ట్‌వేర్ (విండోస్/ నెట్‌వర్క్ ఆపరేటింగ్ సిస్టం/ల్యాన్)పై అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్థులు 27 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది.
పరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులు ప్రారంభం: జూలై 15
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14
సీబీటీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 20
వెబ్‌సైట్: www.natboard.edu.in