Flipkart: ఏపీలో పదో తరగతి అర్హతతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ

|

Jul 31, 2021 | 5:57 AM

Flipkart: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అనేక ప్రముఖ సంస్థల్లో..

Flipkart: ఏపీలో పదో తరగతి అర్హతతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ
Flipkart Jobs
Follow us on

Flipkart: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అనేక ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంస్థ ప్రకటనలు విడుదల చేస్తూ ఉంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు సంబంధించిన ఈ కార్ట్ లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు మాత్రమే చివరి తేదీ ఉంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 108 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 42 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు పదో తరగతి, ఇంటర్ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాల్లో అవకాశం ఉన్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఇక డెలివరీ కన్‌సల్టెంట్‌ విభాగంలో 66 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు పదో తరగతి, ఇంటర్‌ పాస్‌ లేదా ఫెయిల్‌ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇతర వివరాలు:

హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 15 రోజుల పాటు జాబ్ శిక్షణ ఉంటుంది. అభ్యర్థులు సీతారాం నగర్, చిలకలూరిపేట, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి, రేపల్లె, మాచర్ల, వినుకొండ, భట్టిప్రోలు, నిజాంపట్నం, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. అభ్యర్థులు స్మార్ట్ ఫోన్, బైక్, డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలకు 9182280707 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

 

ఇవీ కూడా చదవండి

New Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. జూలై – సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారీగా కోలువులు

CBSE 12th Result 2021 Topper List: సీబీఎస్ఈ బోర్డు ఫలితాల్లో టాపర్స్ వీరే.. పూర్తి వివరాలు మీకోసం..