Telangana Job Fair: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) హైదరాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జూలై 20న మహేశ్వరం మండల ఎంపీడీవో హాలులో జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. జాబ్ ఫెయిర్‌లో 3500 ఖాళీలను భర్తీ చేసేందుకు పది కంపెనీలు ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
1. రిలయన్స్ జియో, హైదరాబాద్
2. ఎస్వీఆర్టీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
3. మ్యాజిక్ బస్, బేగంపేట్
4. మైక్రో మ్యాక్స్ ఫ్యాబిసిటీ
5. విప్రో ఫ్యాక్టరీ, మహేశ్వరం
6. జాన్సన్-లిఫ్ట్
7. జి4 ఎస్ సెక్యూరిటీ
8. మెడ్ ప్లస్
9. కార్వి, హైదరాబాద్
10. అపోలో ఫార్మసీ, హైదరాబాద్
కాగా, ఈ సంస్థలే కాకుండా పది మంది శిక్షణ, ప్లేస్‌మెంట్ భాగస్వాములు 1190 మంది అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు 9963666221 నెంబర్‌కు సంప్రదించవచ్చు.