JEE Main: జేఈఈ మెయిన్ అప్లికేషన్ లో తప్పులు సరిచేసుకోవడానికి చివరి ఛాన్స్..కరెక్షన్స్ చేసుకోవడం ఇలా..!

|

Apr 06, 2021 | 4:43 PM

జేఈఈ మెయిన్ ఏప్రిల్ 2021 అప్లికేషన్ లో తప్పులు దొర్లి ఉంటె సరిచేసుకోవడానికి చివరి తేదీ పొడిగించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏదైనా తప్పులు నమోదు చేసి ఉంటె వీలైనంత త్వరగా వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుంది.

JEE Main: జేఈఈ మెయిన్ అప్లికేషన్ లో తప్పులు సరిచేసుకోవడానికి చివరి ఛాన్స్..కరెక్షన్స్ చేసుకోవడం ఇలా..!
Jee Main
Follow us on

JEE Main: జేఈఈ మెయిన్ ఏప్రిల్ 2021 అప్లికేషన్ లో తప్పులు దొర్లి ఉంటె సరిచేసుకోవడానికి చివరి తేదీ పొడిగించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏదైనా తప్పులు నమోదు చేసి ఉంటె వీలైనంత త్వరగా వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 7 వ తేదీతో ఈ అవకాశం ముగుస్తుంది. సమయం తక్కువగా ఉంది. జేఈఈ కి దరఖాస్తు చేసుకున్నవారు ఒకసారి లాగిన్ అయి మరోసారి మీ దరఖాస్తును చెక్ చేసుకుని తప్పులుంటే సరిచేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ కరెక్షన్ కోసం అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి.

కాగా, మూడో సెషన్ పరీక్షలు ఎన్టీఏ ఏప్రిల్ 27  27 నుండి 30 వరకు నిర్వహిస్తుంది. అలాగే, నాల్గవ సెషన్ పరీక్ష మే 24 నుండి 28 వరకు జరుగుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. 

జేఈఈ అప్లికేషన్ లలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఇలా చేయాలి..

  • అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in కు వెళ్ళాలి.
  • వెబ్‌సైట్‌లో ఇచ్చిన జెఇఇ మెయిన్ 2021 రిజిస్ట్రేషన్ ఫారం దిద్దుబాటు కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ దరఖాస్తు సంఖ్య మరియు పాస్‌వర్డ్‌ను ఇవ్వడం ద్వారా  లాగిన్ అవ్వండి.
  • లాగిన్ సక్సెస్ అయిన వెంటనే మీ దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీరు సరిచేయాలనుకుంటున్న సమాచారాన్ని సవరించండి, మార్పులు చేయండి.
  • దిద్దుబాటు చేసిన తరువాత, తిరిగి దరఖాస్తును సబ్మిట్ చేయండి.

అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ముఖ్యమైన సమాచారం..

ఏప్రిల్ సెషన్లో పేపర్ 1 కి మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే వారు ఈ పరీక్ష రాయవలసి ఉంటుంది. అదేవిధంగా జేఈఈ మెయిన్ పేపర్ 2 ( బి.ఆర్చ్, బి.ప్లానింగ్) కు పరీక్ష ఏప్రిల్ లో నిర్వహించరు.

Also Read: JEE Main 2021 : జేఈఈ మెయిన్ 2021 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇవి తప్పని సరిగా తీసుకెళ్ళాలిసి ఉంటుంది..

Free Coaching: ఐఏఎస్-ఐపీఎస్, టీఈటీ కి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి ఉచిత కోచింగ్..