Attention: ఈ ఏడాది JEE Main 2022లో చోటుచేసుకోనున్న కీలక మార్పులు ఇవే.. నెగెటివ్ మార్కింగ్ ఇంకా..

|

Mar 03, 2022 | 3:24 PM

ఏడాది జరగనున్న జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ (మొదటి సెషన్‌) సెషన్‌ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి1న ప్రారంభంకాగా.. మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఐతే..

Attention: ఈ ఏడాది JEE Main 2022లో చోటుచేసుకోనున్న కీలక మార్పులు ఇవే.. నెగెటివ్ మార్కింగ్ ఇంకా..
Online Registration
Follow us on

JEE Main 2022 registration begins: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2022 పరీక్షను ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మేలలో (రెండు సెషన్లలో) మాత్రమే నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది జరగనున్న జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ (మొదటి సెషన్‌) సెషన్‌ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి1న ప్రారంభంకాగా.. మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో నమోదు చేసుకోవచ్చు. ఐతే ఈ ఏడాది జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవేంటంటే..

  • గత ఏడాది మాదిరి జేఈఈ మెయిన్ 2022 పరీక్ష నాలుగు సార్లు కాకుండా.. రెండుసార్లు మాత్రమే నిర్వహించబడుతుంది. (ఏప్రిల్, మే)
    అంతేకాకుండా మెయిన్ పరీక్షలో సెక్షన్ ఏలో మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలు (MCQ), సెక్షన్ బి న్యూమరికల్‌ ప్రశ్నలుంటాయి. రెండు విభాగాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
  • ఇక దరఖాస్తు ప్రక్రియలో కూడా కొన్ని మార్పులు ఉన్నట్లు ఎన్టీఏ తెల్పింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి మూడు-దశల దరఖాస్తు ప్రక్రియను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.
  • ఇక పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడానికి అభ్యర్ధులు తమకు నచ్చిన ఏవైనా 4 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి.
  • జేఈఈ అప్లికేషన్ నంబర్ తదుపరి వివిధ దశల్లోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. అంటే తదుపరి పరీక్షలకు హాజరవ్వాలన్నా, రెండో సెషన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా ఇదే అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వవలసి ఉంటుంది.

JEE మెయిన్స్ 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను jeemain.nta.nic.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే ‘Registration for JEE(Main) 2022’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే న్యూ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. ‘న్యూ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చెయ్యాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయడానికి, అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ జనరేట్‌ అవుతుంది.
  • కేటాయించిన అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్‌ పూర్తిచేసి సబ్‌మిట్‌ చెయ్యాలి.

Also Read:

Fall Session 2022: ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నారా? ఏడాదికి రూ.7 లక్షల చొప్పున  వరుసగా 4 ఏళ్లపాటు..