
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన వారు అర్హులు. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు5 ఏళ్లు, పీహెచ్‌సీలకు 10 ఏళ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 27, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అప్లికేషన్ల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. మౌఖిక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,600 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నింపిన తర్వాత ఫొటోగ్రాఫ్, ఐడీ ప్రూఫ్ వంటి సంబంధిత సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్ట్ (సంతకం) చేయాలి. వీటన్నింటినీ ఈ కింది అడ్రస్‌కు స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాలి.
The Honourable PRL.DISTRICT AND SESSIONS JUDGE, JAYASHANKAR BHUPALPALLY, Telangana.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.