FAT: జమ్ముకశ్మీర్‌లో 300 పాఠశాలలు బ్యాన్.. ఉగ్రవాద సంస్థ కనుసన్నల్లో నడుస్తూ.. అడ్డంగా దొరికిపోయి!

|

Jun 15, 2022 | 12:36 PM

జమాత్‌-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్‌ (FAT) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్లను నిషేధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం

FAT: జమ్ముకశ్మీర్‌లో 300 పాఠశాలలు బ్యాన్.. ఉగ్రవాద సంస్థ కనుసన్నల్లో నడుస్తూ.. అడ్డంగా దొరికిపోయి!
Fat Affiliated Schools
Follow us on

FAT affiliated schools banned: జమాత్‌-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్‌ (FAT) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్లను నిషేధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. ఎఫ్‌ఏటీ అనుబంధ పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బీకే సింగ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లోగా ఆయా పాఠశాలలకు సీల్ వేయాలని వివిధ జిల్లాలకు చెందిన విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధిత పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 11 వేల మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని విద్యాశాఖ సూచించింది. దీంతో ఎఫ్‌ఏటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లోని టీచర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు.

ఎఫ్‌ఏటీ నిషేధిత విద్యా సంస్థల్లో కొత్త అడ్మిషన్లు చేపట్టరాదని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని విద్యాధికారులను ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసు రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) చేపట్టిన దర్యాప్తు నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. భారీ స్థాయిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, మోసాలకు పాల్పడిందనే ఆరోపణల ఎదుర్కొంటున్న ఎఫ్‌ఏటీ విద్యాసంస్థలపై ఈ మేరకు వేటుపడింది. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం..

ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్‌ భాగోతం వోనుక అసలు కథ

ఇవి కూడా చదవండి

జమాత్-ఇ-ఇస్లామీ సంస్థ 1972లో ఎఫ్‌ఏటీని స్థాపించింది. ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్‌ జమ్మూ, కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో 300 పాఠశాలలను స్థాపించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మే 11,1990న జమాత్-ఇ-ఇస్లామీ (JeI) సంస్థను నిషేధించింది. నిషేధం తర్వాత దీని పరిధిలోని పాఠశాలలు, మొహల్లాలను విలేజ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి అప్పగించింది. ఐతే వాటిల్లో కొన్ని పాఠశాలలు ఇప్పటికీ జమాత్-ఇ-ఇస్లామీ ప్రత్యక్ష నియంత్రణలోనే కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

2008, 2010, 2016లలో పెద్ద ఎత్తున విధ్వంశాలకు పాల్పడిన నిషేధిత జమాత్-ఇ-ఇస్లామీ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఎఫ్‌ఏటీ పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని పరిధిలోని స్కూళ్లు, సెమినరీలు, అనాథ ఆశ్రమాలు, మసీదులు, ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి జమాత్-ఇ-ఇస్లామీ సంస్థ ఆదాయం పొందుతున్నట్లు పేర్కొన్నారు.

మరో కీలక విషయం ఏంటంటే.. ఎఫ్ఏటీ పరిధిలోనున్న దాదాపు 325 విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి స్కూళ్లను స్థాపించినట్లు, ఫోర్జరీలతో ఫేక్‌ డాక్యుమెంట్లను సృష్టించినట్లు దర్యాప్తులో బయటపడింది. వీటిపై SIA ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. గడచిన 30 ఏళ్లలో ఉగ్రవాదుల ఆదేశానుసారం చేసిన మోసాలు, దీని పరిధిలోని అనధికారిక సంస్థల కార్యలపాలన గుట్టను వెలికితీసేందుకు లోతుగా విచారణ చేపడుతున్నట్లు మీడియాకు అధికారులు తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.