ITI Limited Engineer Civil Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్ (ITI Limited).. ఒప్పంద ప్రాతిపదికన 38 ఇంజనీర్ (సివిల్) పోస్టుల (Engineer Civil Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు వివిధ బ్రాంచుల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.22,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చెక్‌చేసుకోవచ్చు.
అడ్రస్:
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.