హైదరాబాద్, ఏప్రిల్ 15: బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులు డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చని తెలిపింది. ఈ కోర్సులో జాయిన్ అంతే బీఎడ్ కోర్సును రెండేండ్లకు బదులుగా ఏడాదిలోనే పూర్తిచేయొచ్చని తెలిపింది. ఈ అవకాశం కల్పిస్తున్న నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) కోర్సును తొలుత రాష్ట్రంలోని మూడు విద్యాసంస్థల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే నిర్వహిస్తున్నారు. ఐటీఈపీ కోర్సులో ప్రవేశాలు పొందాలనుకునే వారు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎన్‌సీఈటీ) పేరిట నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయవల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. 2024 -25 విద్యాసంవత్సరానికి ఎన్‌సీఈటీ ప్రవేశపరీక్షకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జూన్ 12న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు www. nta.ac.in, https://ncet.samarth.ac.in/ వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.
నాలుగేళ్ల ఎన్‌సీఈటీ 2024 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 64 విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈ మూడు కాలేజీల్లో 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ బీఎడ్, బీఎస్సీ బీఎడ్, బీకాం బీఎడ్.. అనే 3 కోర్సులను ఆఫర్ చేస్తోంది. వీటిల్లో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీ వరంగల్‌లోనూ బీఎస్సీబీఎడ్ కోర్సుతో 50 సీట్లు, లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ బీఎడ్ కోర్సులో మరో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంంగా ఉన్న మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు)లలో 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు కోసం ఏప్రిల్ 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుంది. ప్రశ్నాపత్రం తెలుగు/ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లు https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.