ITBP Assistant Commandant (Transport) Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. అర్హులైన మహిళ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 అసిస్టెంట్ కమాండెంట్ (ట్రాన్స్‌పోర్ట్) గ్రూప్ ‘ఏ’పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 9, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫీజు రూ.400లు చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అసిస్టెంట్ కమాండెంట్లకు నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను క్లిక్ చేయండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.