ISRO Recruitment: శ్రీహరికోటలోని సూళ్లూరుపేటలోని స్పేస్ సెంట్రల్ స్కూల్‌లో ఖాళీల భర్తీ చేయనున్నారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ షార్) ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 19 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) (02), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఫిజిక్స్) (01), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (బయాలజీ) (01), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కెమిస్ట్రీ) (01), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) (02), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (హిందీ) (02), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లిష్) (01), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (కెమిస్ట్రీ) (01)ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(బయాలజీ) (01), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీఈటీ) (02), ప్రైమరీ టీచర్ (05) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీనియర్ సెకండరీ, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఎల్ఈడీ, బీపీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28-08-2022 నాటికి పీజీటీ అభ్యర్థులకు 18 నుంచి 40, టీజీటీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, పీటీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* రాత పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌లో సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు 28-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..