ISRO Recruitment: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులోని ఇస్రో హ్యూమన్ స్పేస్ రీసెర్చ్ ప్లయిట్ సెంటర్ (హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ) పలు పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (జేటీఓ) పోస్టులను తీసుకోనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థులు హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువాదం చేయగలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 20-11-2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* రాత పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్–ఏ ఆబ్జెక్టివ్, పార్ట్–బి డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. రాతపరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల్ని స్కిల్ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 20-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి..
Also Read: Bandi Sanjay: అసలు దోషి టీఆర్ఎస్ ప్రభుత్వమే.. పెట్రోల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు: బండి సంజయ్
Silver Price Today: వెండి కొనుగోలుదారులకు షాకింగ్.. భారీగా పెరిగిన సిల్వర్ ధర.. ప్రధాన నగరాల్లో..