ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పరిధిలోని వివిధ సెంటర్/యూనిట్లలో ఖాళీగా ఉన్న 68 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో కనీసం 65 శాతం మార్కలతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్‌లో గేట్ 2021/2022 స్కోర్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్ 19, 2022వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.250లు అప్లికేషన్ ఫీజు డిసెంబర్ 21, 2022వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, గేట్ స్కోర్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.56,100ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.