IRCTC Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పదో తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 10 లోగా దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ గడువు ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. తర్వాత పరిస్థితులను బట్టి గడువు పెంచుతారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
► మొత్తం ఖాళీలు- 150
► విద్యార్హతలు: 10వ తరగతి పాస్ కావాలి
► ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2021 సెప్టెంబర్ 3
► దరఖాస్తుకు చివరి తేదీ: 2021 అక్టోబర్ 10
► వయస్సు: వయస్సు పరిమితి లేదు
► ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
► దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
► అప్రెంటీస్ కాలం: 12 నెలలు
► వేతనం: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య వేతనం ఉంటుంది.
► పోస్టింగ్: ఐఆర్‌సీటీసీ కార్యాలయం, న్యూ ఢిల్లీ.
► అభ్యర్థులు ముందుగా https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
► హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేసి Candidate క్లిక్ చేయాలి.
► పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
► రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
► లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో Apprentices పైన క్లిక్ చేయాలి.
► Apprentice Search లో ఐఆర్‌సీటీసీ టైప్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లింక్ క్లిక్ చేయాలి.
► ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు నేరుగా ఈ లింక్ క్లిక్ చేసినా దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది.
► ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు చేయొచ్చు.
► దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.