IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం.

|

Mar 29, 2022 | 7:34 PM

IRCON Recruitment: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IRCON Recruitment: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం.
Ircon Jobs
Follow us on

IRCON Recruitment: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సిగ్నలింగ్ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ (01), డిప్యూటీ జనరల్‌ మేనేజర్ (01), మేనేజర్‌ (01), డిప్యూటీ మేనేజర్లు (02), అసిస్టెంట్‌ మేనేజర్లు (07), అసిస్టెంట్‌ మేనేజర్లు (ఎలక్ట్రికల్‌)-05, ఎగ్జిక్యూటివ్‌/ఎలక్ట్రికల్‌ (06) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ కార్యలయానికి పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 30,000 నుంచి రూ. 2,20,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 18-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: TS Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. టీశాట్‌లో ఉచితంగా కోచింగ్‌..

Karnataka: కర్ణాటకలో తెరపైకి మరో వివాదం.. ఆలయాల పరిసరాలల్లో హిందూయేతర వ్యాపారస్తులకు అనుమతి వద్దంటూ ప్రభుత్వానికి వినతి

Vijay Deverakonda: రౌడీ బాయ్‌తో డైనమిక్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..