IOCL Recruitment 2022: 626 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. పూర్తివివరాలివే..

|

Jan 30, 2022 | 3:50 PM

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం విడుదల చేసిన..

IOCL Recruitment 2022: 626 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. పూర్తివివరాలివే..
Follow us on

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం విడుదల చేసిన నోటీఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ రేపటి(31 జనవరి 2022)తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 626 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు IOCL – iocl.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జనవరి 15 నుండి ప్రారంభమైంది.

ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాజస్థాన్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు ఐఓసీఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి.

ఇలా దరఖాస్తు చేసుకోండి..
– ఐఓసీఎల్ దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్- iocl.com ను సందర్శించాలి.
– వెబ్‌సైట్ హోమ్ పేజీలో, రిక్రూట్‌మెంట్‌పై క్లిక్ చేయాలి.
– ఇప్పుడు “టెక్నికల్ & నాన్-టెక్నికల్ అప్రెంటీస్ కోసం నోటిఫికేషన్ – నార్తర్న్ రీజియన్ (MD)” కింద “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
– అప్లికేషన్ పోర్టల్‌ని తెరిచిన తర్వాత, “ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్”పై క్లిక్ చేసి, మీ ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
– మీ మొబైల్ నెంబర్‌కు, ఈమెయిల్‌కు OTP వస్తుంది.
– అప్లికేషన్ ఫామ్‌ని నింపి.. దరఖాస్తును సబ్మిట్ కొట్టండి.
– అభ్యర్థి ఫామ్‌ని నింపిన తరువాత ప్రింట్ అవుట్‌ను తీసుకొని భవిష్యత్తు అవసరం కోసం భద్రపరుచుకోండి.

ఖాళీల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 626 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ కేటగిరీకి 317 పోస్టులు కేటాయించారు. అదే సమయంలో, ఈడబ్ల్యూఎస్ వారికి 47 పోస్టులు, OBCకి 136 పోస్టులు, SC కేటగిరీలో 109 పోస్టుల రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దీంతో పాటు ఎస్టీ కేటగిరీలో 17, పీడబ్ల్యూడీలో 25 పోస్టులు ఉన్నాయి.

అర్హత & వయో పరిమితి..
గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 12 వ తరగతి (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ITI డిప్లొమా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల దరఖాస్తుదారుల వయస్సు 31 డిసెంబర్ 2021 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

Also read:

Love Story: కొడుకు చేసిన పనికి దారుణ హత్యకు గురైన తల్లి.. ఇంతకీ అతనేం చేశాడంటే..

PM Modi-Vaccine: దేశంలో 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ పూర్తి..శభాస్ ఇండియా అంటూ ప్రధాని ట్వీట్..

Viral Photos: 2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు..?