IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న..

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 265 ట్రేడ్‌ అప్రెంటిస్‌/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో..

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న..
IOCL Apprentice Recruitment 2022

Updated on: Nov 12, 2022 | 6:37 AM

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 265 ట్రేడ్‌ అప్రెంటిస్‌/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (అక్టోబర్‌ 31, 2022) సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, డేటా ఎట్రీ ఆపరేటర్, రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు స్కిల్‌ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నవంబర్‌ 27వ తేదీన రాత పరీక్ష నిర్వహింస్తారు. ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.