IOCL Recruitment 2022: రాత పరీక్షలేకుండానే..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో నెలకు 40వేల జీతంతో ఉద్యోగాలు

|

Mar 10, 2022 | 8:37 AM

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో రిఫైనరీస్‌ డివిజన్‌ పరిధిలోని బరౌనీ రిఫైనరీ.. అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల (Assistant Officer Posts) భర్తీకి..

IOCL Recruitment 2022: రాత పరీక్షలేకుండానే..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో నెలకు 40వేల జీతంతో ఉద్యోగాలు
Follow us on

IOCL Assistant Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో రిఫైనరీస్‌ డివిజన్‌ పరిధిలోని బరౌనీ రిఫైనరీ.. అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల (Assistant Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: ఇంకా ప్రకటించలేదు

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు జూన్‌ 30, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ. 40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పాటు సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము చెల్లించవల్సిన అవసరం లేదు.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు.. బెల్‌లో నెలకు 55 వేల జీతంతో ఉద్యోగాలు..