BEL Recruitment 2022: బీఈ/బీటెక్ మెరిట్ ఆధారంగా ఎంపికలు.. బెల్‌లో నెలకు 55 వేల జీతంతో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. ఘజియాబాద్ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ (Trainee Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
BEL Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. ఘజియాబాద్ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ (Trainee Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
- ట్రైనీ ఇంజనీర్ పోస్టులు: 13
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో ఏడాదిపాటు పని అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు: 25
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 2 ఏళ్ల పాటు పని అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 23, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: