IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 అప్రెంటిస్‌ పోస్టులు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

|

Sep 25, 2022 | 7:20 AM

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Trade & Technician Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 అప్రెంటిస్‌ పోస్టులు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
IOCL Apprentice Recruitment 2022
Follow us on

IOCL Trade & Technician Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Trade & Technician Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, ఫిట్టర్, కెమికల్, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, అకౌంట్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏ/బీఎస్సీ/బీకాం/ఇంటర్మీడియట్‌/ఐటీఐ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి ప్రతి నెలా స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఎంపికైనవారు గౌహతి, డిగ్‌బోయి, బొంగైగావ్ (అస్సాం), బరౌని (బీహార్), వడోదర (గుజరాత్), హల్దియా (పశ్చిమ బెంగాల్), మధుర (UP), పానిపట్ {పానిపట్ రిఫైనరీ &పెట్రోకెమికల్ కాంప్లెక్స్ (PRPC) (హర్యానా), పారాదీప్ (ఒడిశా) ప్రాంతాల్లో పనిచేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ట్రేడ్ అప్రెంటిస్

ఇవి కూడా చదవండి
  • అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) ఖాళీలు: 396
  • ఫిట్టర్ ఖాళీలు: 161
  • బాయిలర్ ఖాళీలు: 54
  • సెక్రటేరియల్ అసిస్టెంట్ ఖాళీలు: 39
  • అకౌంటెంట్ ఖాళీలు: 45
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు: 73

టెక్నీషియన్ అప్రెంటిస్

  • కెమిస్ట్రీ ఖాళీలు: 332
  • మెకానికల్ ఖాళీలు: 163
  • ఎలక్ట్రికల్ ఖాళీలు: 198
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఖాళీలు: 74

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 23, 2022.
  • అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ తేదీ: నవంబర్‌ 1 నుంచి 5 వరకు, 2022.
  • రాత పరీక్ష తేదీ: నవంబర్‌ 6, 2022.
  • ఫలితాల ప్రకటన తేదీ: నవంబర్‌ 21, 2022.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ తేదీలు: నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 7 వరకు, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.