Infosys: గ్రాడ్యుయేట్ల‌కు గుడ్ న్యూస్‌.. 35వేల మందికి ఉద్యోగ అవకాశాలు: ఇన్ఫోసిస్‌

| Edited By: Subhash Goud

Jul 14, 2021 | 8:28 PM

Infosys: దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా పేరొందిన ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏకంగా 35వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్ల‌ను రిక్రూట్ చేసుకోనుంది. ఈ మేర‌కు ఆ కంపెనీ..

Infosys: గ్రాడ్యుయేట్ల‌కు గుడ్ న్యూస్‌.. 35వేల మందికి ఉద్యోగ అవకాశాలు: ఇన్ఫోసిస్‌
Infosys
Follow us on

Infosys: దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా పేరొందిన ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏకంగా 35వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్ల‌ను రిక్రూట్ చేసుకోనుంది. ఈ మేర‌కు ఆ కంపెనీ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. డిజిట‌ల్ టాలెంట్‌కు డిమాండ్ పెరుగుతుంద‌ని, అందుక‌నే కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. ఈ మేర‌కు ఇన్ఫోసిస్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ ప్ర‌వీణ్ రావు వివరాలు వెల్లడించారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఉద్యోగులను ఆరోగ్యంగా ఉంచ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, అందుకు గాను వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టామ‌ని తెలిపారు. అలాగే కెరీర్‌లో ఉద్యోగులు మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు చేరుకునేందుకు ప‌లు కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టామని తెలిపారు. అయితే వారు త‌మ స్కిల్స్ ను మెరుగు ప‌రుచుకునేందుకు ప‌లు యాక్టివిటీల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

కాగా, జూన్ 2021తో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ రూ.5,195 కోట్ల లాభాల‌ను గడించింది. ఈ క్ర‌మంలో ఇదే త్రై మాసికంలో ఆ కంపెనీ ఆదాయం రూ.27,896 కోట్ల‌కు పెరిగింది. జూన్ నెల‌తో ముగిసిన త్రై మాసికానికి ఆ కంపెనీ 2.6 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన డీల్స్‌పై ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ క్ర‌మంలోనే 23.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.

ఇవీ కూడా చదవండి:

India Post Payments Bank: పోస్టల్‌ బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఆగస్టు 1 నుంచి పెరగనున్న చార్జీలు

Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం.. లాఫాయేట్‌ కాలేజీ రూ. 2 కోట్ల స్కాలర్‌షిప్‌