AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: ఇప్పుడు ఆ కంపెనీ వంతు కూడా వచ్చేసింది.. ఉద్యోగులను తొలగిస్తున్న ఇండియన్‌ టెక్‌ దిగ్గజం.

ఆర్థికమాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ టెక్‌ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. గూగుల్‌, మెటా, ట్విట్టర్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించాయి. ఇక గత కొన్ని రోజులుగా లేఆఫ్స్‌కి సంబంధించిన వార్తలు పెద్దగా రావడం లేదని సంతోషించేలోపే..

Layoffs: ఇప్పుడు ఆ కంపెనీ వంతు కూడా వచ్చేసింది.. ఉద్యోగులను తొలగిస్తున్న ఇండియన్‌ టెక్‌ దిగ్గజం.
Layoffs
Narender Vaitla
|

Updated on: Mar 20, 2023 | 12:49 PM

Share

ఆర్థికమాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ టెక్‌ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. గూగుల్‌, మెటా, ట్విట్టర్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించాయి. ఇక గత కొన్ని రోజులుగా లేఆఫ్స్‌కి సంబంధించిన వార్తలు పెద్దగా రావడం లేదని సంతోషించేలోపే ఇండియన్‌ టెక్‌ దిగ్గజం విప్రో బాంబు పేల్చింది. విప్రో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే 120 మంది టెక్కీలను తొలగించాలని నిర్ణయించింది. అయితే ఈ తొలగింపులు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం. అది కూడా అమెరికాలోని టంపాలో మాత్రమే కోతలు ఉన్నాయి. లేఆఫ్‌కి గురైన ఉద్యోగుల్లో 100 మందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్ స్థాయి ఉద్యోగులను సమాచారం. ఇదిలా ఉంటే ఉద్యోగుల తొలగింపు ఇక్కడితో ఆగదని, ఇంకా కొనసాగుతుందని తెలుస్తోంది. మే నెలలో కంపెనీ ఉద్యోగుల శాశ్వత తొలగింపులను ప్రారంభించనుంది.

ఇదిలా ఉంటే విప్రోకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే విప్రో ఆదాయంలో దాదాపు 60 శాతం ఆదాయం అమెరికా నుంచే వస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికాలోనే ఉద్యోగుల తొలగింపు మొదలు పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలోనే విప్రో.. ఇంటర్నల్ ఎసెస్మెంట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన దాదాపు 400 మంది ఫెషర్లను తొలగించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెద్ద చెవులు.. చిన్న కళ్ల వెనుక పెద్ద మెసేజ్ దాగి ఉందా..?
పెద్ద చెవులు.. చిన్న కళ్ల వెనుక పెద్ద మెసేజ్ దాగి ఉందా..?
ఛీ కొట్టినా, వద్దని దూరం పెట్టినా.. ఆఇద్దరు రిటైర్మెంట్ చేయరేం..?
ఛీ కొట్టినా, వద్దని దూరం పెట్టినా.. ఆఇద్దరు రిటైర్మెంట్ చేయరేం..?
ఎంత క్యూట్‏గా ఉన్నారో.. మెగా ఫ్యామిలీ కృష్ణాష్టమి వేడుకలు..
ఎంత క్యూట్‏గా ఉన్నారో.. మెగా ఫ్యామిలీ కృష్ణాష్టమి వేడుకలు..
కేవలం నెలకు రూ.210 డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.5000వేలు
కేవలం నెలకు రూ.210 డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.5000వేలు
నేపాల్‌లో అద్భుతం! 9 రోజుల తర్వాత ఇద్దరు సజీవంగా..!
నేపాల్‌లో అద్భుతం! 9 రోజుల తర్వాత ఇద్దరు సజీవంగా..!
ఇంట్లో గోల్డ్ ఫిష్ పెంచుతున్నారా? వాస్తు ప్రకారం కాసుల వర్షమే!
ఇంట్లో గోల్డ్ ఫిష్ పెంచుతున్నారా? వాస్తు ప్రకారం కాసుల వర్షమే!
కరువు పరిస్థితుల్లో అండగా నిలిచే సెప్టెంబర్ నెల పంటలు ఇవే..
కరువు పరిస్థితుల్లో అండగా నిలిచే సెప్టెంబర్ నెల పంటలు ఇవే..
నేపాల్‌కు సోనూసూద్‌ సాయం.. సెల్ఫ్ మార్కెటింగ్ అంటూ విమర్శలు
నేపాల్‌కు సోనూసూద్‌ సాయం.. సెల్ఫ్ మార్కెటింగ్ అంటూ విమర్శలు
రూ. 299 కే 30 రోజుల వ్యాలిడిటీ.. BSNL సూపర్ రీఛార్జ్ ప్లాన్!
రూ. 299 కే 30 రోజుల వ్యాలిడిటీ.. BSNL సూపర్ రీఛార్జ్ ప్లాన్!
మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉంది..? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..
మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉంది..? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..