IREL Recruitment 2021: ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా అప్లై చేసుకోవాలి..

|

Jun 01, 2021 | 4:14 PM

IREL Recruitment 2021: ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ సంస్థ ముంబైలోని భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగంలో సేవ‌లందిస్తోంది. నోటిఫికేష‌న్‌లో...

IREL Recruitment 2021: ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా అప్లై చేసుకోవాలి..
Irel Jobs
Follow us on

IREL Recruitment 2021: ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ సంస్థ ముంబైలోని భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగంలో సేవ‌లందిస్తోంది. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 8 ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిక్రూట్ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* రిక్రూట్ చేయ‌నున్న మొత్తం 8 పోస్టుల్లో చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌ (టెక్నికల్‌)–02, మేనేజర్‌(లీగల్‌)–01, మేనేజర్‌ (సెక్యూరిటీ)–03, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ఎం)–02 ఉన్నాయి.

* చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌(టెక్నికల్‌) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభ‌వం ఉండాలి.

* మేనేజర్‌(లీగల్‌) ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. లా గ్రాడ్యుయేషన్‌ (మూడు సంవత్సరాలు)/తత్సమాన ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 21.06.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.

* మేనేజర్‌(సెక్యూరిటీ) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఇండియన్‌ ఆర్మీలో కెప్టెన్‌ హోదాకు తగ్గకుండా/తత్సమాన ర్యాంకుతో పనిచేసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 21.06.2021 నాటికి 53ఏళ్లు మించకూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులను ఇంటర్వూ/సైకోమెట్రిక్‌ టెస్ట్‌/గ్రూప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు.. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తును డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(పర్సనల్‌), ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్, వీర్‌ సావర్కర్‌ మార్గ్, ప్రభాదేవి, ముంబై–400028 చిరునామాకు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 21.06.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: SBI కస్టమర్లకు అలర్ట్.. తొందరగా ఈ పనిని చేయండి.. మరోసారి హెచ్చరించిన బ్యాంకు.. చివరి తేదీ ఎప్పుడంటే..

5G Phones Coming This June: ఈ నెల‌లో మార్కెట్లో సంద‌డి చేయ‌నున్న 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..

Rain Alert: ఏపీలో రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులపాటు వర్షాలు.. ఉరుములు మెరుపులతో..