రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మరో కీలక ప్రకటన జారీ చేసింది. రైల్వేలో వేర్వేరు కేటగిరీల్లో దాదాపు 1,036 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలోనే విడుదలకానుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీతో పాటు పలు పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జనవరి 7, 2025 నుంచి అన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 6, 2025. దరఖాస్తు సమయంలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారు రూ.500, ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు రూ.250 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎంపిక విధానం, అర్హతలు, వయోపరిమితి వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు.