Railway Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఇక తాజాగా రైల్వే శాఖలో కూడా భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇక తాజాగా కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా, దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14 వరకు ఉంది. ఇందులో భాగంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1785 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారుఖరగ్‌పూర్, సత్రగచి, చక్రధర్‌పూర్, టాటా, ఝర్సుగూడ, రాంచీలో పనిచేయాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
► ఖరగ్‌పూర్ వర్క్‌షాప్ 360
► సిగ్నల్ అండ్ టెలికమ్ 87
► ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ 120
► ఎస్‌ఎస్‌ఈ 28
► క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 121
► డీజిల్ లోకో షెడ్ 50
► సీనియర్ డీఈఈ 90
► టీఆర్‌డీ డిపోట్ 40
► ఈఎంయూ షెడ్ 40
► ఎలక్ట్రిక్ లోకోషెడ్ 36
► సీనియర్ డీఈఈ 93
► ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ డిపో 30
► క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 65
► ఎలక్ట్రిక్ లోకో షెడ్ (టాటా) 72
► ఇంజినీరింగ్ వర్క్‌షాప్ 100
► ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ 7
► ఎస్‌ఈఈ వర్క్స్ 26
► ఎలక్ట్రిక్ లోకోషెడ్ 50
► డీజిల్ లోకోషెడ్ 52
► సీనియర్ డీఈఈ 30
► క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 95
► డీజిల్ లోకోషెడ్ 33
► టీఆర్‌డీ డిపో 30
► ఎలక్ట్రిక్ లోకోషెడ్ 31
► ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్ 25
► ఎస్‌ఈఈ వర్క్ 24
► క్యారేజ్ అండ్ వ్యాగన్ 30
► టీఆర్‌డీ డిపో 10
► ఎస్‌ఈఈ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత:అభ్యర్థులు పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి జనవరి 1, 2022 నాటికి కనీసం 15 నుంచి 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులు కావాలి.
ఎంపిక: అకాడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
వెబ్‌సైట్: