Indian Railway Recruitment 2021: దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 4103 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 4103 ఖాళీలకు గాను కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పాస్ కావాలి.
* అభ్యర్థుల వయసు 04-10-2021 నాటికి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది అప్రెంటీస్ ఉంటుంది. సెంట్రల్ అప్రెంటీస్‌షిప్ కౌన్సిల్ సిలబస్ ప్రకారం శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌షిప్ రూల్స్ ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 03-11-2021ని నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: ఇంటి వరండాలో ఊహించని సీన్.. చూసి షాకైన జనాలు.. వైరల్ వీడియో.!
Milk Benefits: మంచి నిద్రకు వేడిపాలు సహాయపడుతుందా? ఎందుకలా? పరిశోధకులు ఏమంటున్నారు? (వీడియో)