Job Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ సంస్థలో 1196 అప్రెంటిస్‌ ఉద్యోగాలు..!

Job Recruitment:ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు..

Job Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ సంస్థలో 1196 అప్రెంటిస్‌ ఉద్యోగాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 30, 2022 | 4:42 AM

Job Recruitment:ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల అవుతున్నాయి. ఆసక్తి, అర్హత గల వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక దేశంలో అతిపెద్ద చ‌మురు ఉత్ప‌త్తి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేష‌న్ (IOCL) ట్రేడ్ అప్రెంటిస్‌ల‌ను అందిస్తున్న‌ది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

ఈ ఉద్యోగ నోటిఫికేష‌న్ ద్వారా 1196 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. ఈ నోటిఫికేషన్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌, టెక్నీషియ‌న్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఇవి నార్త‌ర్న్ రీజియ‌న్, వెస్ట్ర‌న్ రీజియ‌న్‌లో ఖాళీగా ఉన్నాయి. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ది.

మొత్తం పోస్టులు: 1196

ఇందులో నార్త‌ర్న్ రీజియ‌న్‌లో 626, వెస్ట్ర‌న్ రీజియ‌న్‌లో 570 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఇంట‌ర్‌, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జ‌న‌వ‌రి 31 (నార్త‌ర్న్ రీజియ‌న్), ఫిబ్ర‌వ‌రి 15 (వెస్ట్ర‌న్ రీజియ‌న్) వెబ్‌సైట్‌: https://iocl.com/

ఇవి కూడా చదవండి:

CPRI Bengaluru Jobs: బీటెక్ అర్హతతో నెలకు లక్షకు పైగా జీతంతో ఉద్యోగావకాశాలు.. అకడమిక్ మెరిట్‌తో ఎంపికలు..!

IIT Kharagpur Jobs: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!