IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు..నెలకు రూ.2లక్షలకుపైగా జీతం..

|

May 29, 2022 | 8:08 AM

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, అడిషనల్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Senior Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు..నెలకు రూ.2లక్షలకుపైగా జీతం..
Indian Oil
Follow us on

IOCL SMO and ACMO Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, అడిషనల్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Senior Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (SMO), అడిషనల్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ (ACMO) పోస్టులు

ఇవి కూడా చదవండి

మొత్తం ఖాళీలు: 43

ఖాళీల వివరాలు:

  • సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 35
  • అడిషనల్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 8

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్:

  • సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ. 60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • అడిషనల్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ. 90,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంఎస్‌. ఎండీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.300
  • గ్రూప్‌ ‘సీ’ పోస్టులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. హిందీ/ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే ఇంటర్వ్య ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

హార్డు కాపీలను పంపవలసిన చిరునామా: The Advertiser, Post Box No.3096, Head Post Office, Lodhi Road, New Delhi 110003.

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 7, 2022.

హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: జూన్‌ 16, 2022.

రాత పరీక్ష తేదీ: జూన్‌ 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.