భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ నౌకాదళంలో 244 కొలువు భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్ కింద ఉద్యోగం పొందుకున్న వారికి సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు అందించనుంది. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచీల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జనరల్ సర్వీస్, ఏటీసీ, పైలట్, లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అన్ని పోస్టులకూ జులై 2, 1999 నుంచి జనవరి/జులై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తులు పరిశీలించి వడపోత నిర్వహించి తుది జాబితాను సెలక్ట్ చేస్తారు. అనంతరం సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో మెరిట్ మార్కులు పొందినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారికి నేవల్ అకాడెమీ, ఎజిమాళలో 2024, జూన్ నుంచి 44 వారాలపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి నెలకు రూ.56,100 వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్స్‌ను కూడా అందిస్తారు. వీటన్నింటితో కలిపి మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. ప్రొబేషన్ వ్యవధి రెండేళ్లు ఉంటుంది. ప్రొబేషన్ వ్యవధి పూర్తయ్యాక పదేళ్లు విధుల్లో కొనసాగుతారు. అనంతరం పనితీరును బట్టి మరో నాలుగేళ్లు సర్వీస్ వ్యవధి పొడిగిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 29, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.