Indian Navy Jobs 2023: ఇండియన్‌ నేవీ బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ జులై 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Jan 25, 2023 | 9:56 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ నేవీ పరిధిలోని కేరళలోని ఐఎన్‌ఏ ఎజిమలలో ప్రారంభం కానున్న 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీం జులై 2023 కింద నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీ కోర్సులో..

Indian Navy Jobs 2023: ఇండియన్‌ నేవీ బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ జులై 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Indian Navy
Follow us on

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ నేవీ పరిధిలోని కేరళలోని ఐఎన్‌ఏ ఎజిమలలో ప్రారంభం కానున్న 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీం జులై 2023 కింద నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఎగ్జిక్యూటివ్ అండ్‌ టెక్నికల్, ఎడ్యుకేషన్‌ బ్రాంచుల్లో 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా 10+2లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తుదారులు తప్పనిసరిగా జనవరి 2, 2004 నుంచి జులై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 12, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. ఎంపిక విధానం, శిక్షణ, జీతభత్యాలకు సంబంధించిన సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.