Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ డ్యూటీ(జీడీ) & కమర్షియల్ పైలట్ లైసెన్స్ (ఎస్‌ఎస్‌ఏ) (50), టెక్నికల్(మెకానికల్) & టెక్నికల్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) (20), లా ఎంట్రీ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా మ్యాథ్స్, ఫిజిక్స్‌లో ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, లా, డిప్లొమా, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ చివరికి మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు 07-09-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..