
ఇండియన్ ఆర్మీ నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. క్రీడా కోటాలో డైరెక్ట్ ఎంట్రీ కింద హవిల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తూ కమిషన్ ప్రకటన వెలువరించనుంది. 2023 అక్టోబర్ 1 నుంచి, ఆ తరువాత అంతర్జాతీయ, జూనియర్ లేదా సీనియర్ కేటగిరీలో జాతీయ ఛాంపియన్‌షిప్, ఖేలో ఇండియా గేమ్స్, యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు దరఖాస్తు చేస్తుకోవచ్చు. నియామక ట్రయల్స్ కోసం అర్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు భారత సైన్యం ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
స్పోర్ట్స్ కోటాలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, డైవింగ్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్‌బాల్, కబడ్డీ తదితర క్రీడల్లో అంతర్జాతీయ లేద జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ లేద ఖేలో ఇండియా గేమ్స్ లేదా యూత్ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 17 ½ సంవత్సరాల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటు మార్చి 31, 2001 నుంచి ఏప్రిల్ 1, 2008 ఏళ్ల మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా డిసెంబర్ 15, 2025వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు ఫోన్ ద్వారా పంపించవల్సి ఉంటుంది.
డైరెక్టరేట్ ఆఫ్ పీటీ అండ్ స్పోర్ట్స్, జనరల్ స్టాఫ్ బ్రాంచ్, ఐహెచ్‌క్యూ (ఆర్మీ), రూమ్ నెం. 747, ‘ఎ’ వింగ్, సేనా భవన్, న్యూఢిల్లీ.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.