ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. చెన్నైనలోని ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో వేలూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని రిక్రూటింగ్ ఆఫీస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనవచ్చని తెలిపారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 /ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లీష్) ఉత్తీర్ణులై ఉండాలి. శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 17 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* ర్యాలీని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, వేలూరు, తమిళనాడులో నిర్వహిస్తారు.
* అభ్యర్థులను డాక్యుమెంట్ స్క్రీనింగ్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆర్మీ ర్యాలీని నవంబర్ 22, 2022 నుంచి నవంబర్ 26, 2022 వరకు నిర్వహిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 30, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను ఫిబ్రవరి 26, 2023న నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..