Indian Army OTA Chennai Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) 2022 అక్టోబర్ సంవత్సరానికిగానూ 59వ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC Tech) మన్, 30వ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSCW Tech) ఉమెన్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ చదివిన అవివాహితులైన స్త్రీ, పురుషుల, డిఫెన్స్ పర్సనల్ విడోస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 191
పోస్టుల వివరాలు: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మన్, 30వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు
విభాగాలు: సివిల్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పోషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/బీఈ/బీటెక్/ ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: