Indian Army Jobs 2021: ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..

|

Mar 18, 2021 | 1:53 PM

Indian Army Jobs 2021: ఇంటర్‌ పాస్‌ అయిన వారికి గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ టీఈఎస్‌ 45 నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రతియేటా టెక్నిల్‌ స్కీమ్‌ (టీఈఎస్‌) ద్వారా పలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను..

Indian Army Jobs 2021: ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..
Indian Army
Follow us on

Indian Army Jobs 2021: ఇంటర్‌ పాస్‌ అయిన వారికి గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ టీఈఎస్‌ 45 నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రతియేటా టెక్నిల్‌ స్కీమ్‌ (టీఈఎస్‌) ద్వారా పలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది ఇండియన్‌ ఆర్మీ. గత సంవత్సరం ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టులను భర్తీ చేసింది.
తాజాగా జూలై సెషన్‌ నోటిఫికేషన్‌ ద్వారా 90 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తు చేసుకనేందుకు చివరి తేదీ మార్చి 21. ఆసక్తిగల అభ్యర్థులు ttp://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ ద్వరాఆ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

విద్యార్హతలు :
ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో 10+2 పాస్‌ కావాల్సి ఉంటుంది. కనీసం 70 మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 19 ఏళ్ల వరకు ఉండవచ్చు. అయితే ఈ పోస్టులకు పెళ్లికాని యువకులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Online Application పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. అభ్యర్థుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత సేవ్‌ చేసి సబ్మిట్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇవీ చదవండి: RBI CTS: కొత్త చెక్కు విధానంపై ఆర్బీఐ కీలక ఆదేశాలు.. అన్ని బ్యాంకులలో సెప్టెంబర్‌ 30లోపు కొత్త చెక్‌ వ్యవస్థ

Truck Driver Fine: ఇదేమి చిత్రం.. హెల్మెట్‌ లేదని ట్రక్కు డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా