Indian American Girl: భారత సంతతికి చెందిన అమ్మాయి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోని అత్యుత్తమ తెలివైన విద్యార్ధుల్లో ఒకరిగా నటాషా పెరీను యుఎస్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. న్యూ జెర్సీలోని శాండ్‌మీర్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్న నటాషా అత్యంత తెలివైన విద్యార్ధినిగా గుర్తించింది. నటాషా ఇటీవల ఒక టాలెంట్ టెస్టులో పాల్గొంది. 2020-21 జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ టాలెంట్ సెర్చ్‌లో పాల్గొన్న నటాషా పెరీ తన అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఈ పోటీల్లో SAT, ACT వంటి అసెస్‌మెంట్ టెస్టులు నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 84దేశాల నుంచి 19,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీ 2021 మార్చి లో జరిగాయి. అప్పుడు నటాషా ఫిఫ్త్ గ్రేడ్ చదువుతుంది. అయితే ఈ పోటీపరీక్షలో ఫలితాలు నిర్వాహకులను ఆశ్చర్యపరిచాయి. నటాషా ఫెర్ఫామెన్స్ గ్రేడ్ 8చదివే వారితో సమానం అని క్వాంటిటేటివ్ నిర్వాహకులు చెప్పారు.
కష్టమైన ఈ పోటీ పరీక్షలో తక్కువ మంది క్వాలిఫై అవుతారు.. నటాషా క్వాలిఫై కావడమే కాదు.. టాపర్ గా నిలిచింది. జాన్ హాప్‌కిన్స్ విద్యావేత్తలు సైతం నటాషా పెరీ ప్రతిభకు మంత్రముగ్దులయ్యారు. తర్వాత ఆమెకు “హై హానర్స్ అవార్డ్స్ ” అవార్డు ప్రకటించారు. తనకు అవార్డు ప్రకటించడం పట్ల నటాషా హర్షం వ్యక్తం చేసింది. తనను మరింతగా ఈ అవార్డు ప్రోత్సహిస్తుందని తెలిపింది. అంతేకాదు తాను ఎక్కువగా డూడ్లింగ్, జెఆర్ఆర్ టోల్కీన్ నవలలు చదువుతానని.. అందుకనే క్వాంటిటేటివ్ స్కిల్స్ అభివృద్ధి చెంది ఉండవచ్చునని తెలిపింది. ఈ అవార్డు ను అందుకోవాదానికి యూస్ లోని మొత్తం 50 యుఎస్ రాష్ట్రాల నుండి అవార్డు గ్రహీతలు వస్తారు.
Also Read: రోజూ ఉదయాన్నే దోసకాయ వాటర్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో.. తయారీ ఎలా అంటే