Indian Air Force Exam Postponed: కరోనా సెకండ్ వేవ్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఓ వైపు విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. అలాగే వీటికి తోడు పరీక్షలు సైతం వాయిదా పడుతున్నాయి. ముఖ్యంగా పలు బోర్డులు పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కూడా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎయిర్ మెన్ రిక్రూట్‌మెంట్’ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఏప్రిల్ 18 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో పరీక్షలను ఇప్పుడు నిర్వహించలేమని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ careerindianairforce.cdac.inలో త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 7న ప్రారంభమై 22తో ముగిసింది. ఇక పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి ఫేస్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. మొదటి ఫేస్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి మరో రాత పరీక్షను నిర్వహిస్తారు. అది కూడా ఉత్తీర్ణత అయితే చివరగా వైద్య పరీక్షలను నిర్వహించి సెలక్ట్ చేసుకుంటారు. ఇందులో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600 స్టైఫండ్‌గా ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత గ్రూప్ ‘ఎక్స్’ ట్రేడ్‌లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ .33,100, మిగతా విభాగాల్లో చేరిన వారికి నెలకు రూ .26,900 వేతనం లభిస్తుంది.
Also Read: RRB Group D Exam Date: ఆర్ఆర్‌బి గ్రూప్-డి పరీక్షకు సిద్ధమవుతున్నారా? కీలక సమాచారం మీకోసం..
ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి రోజులు..! 17 నుంచి 28 శాతం పెరిగిన డీఏ.. ఎప్పటి నుంచి అమలవుతుందంటే..?