
Post Office Jobs: ఇండియా పోస్ట్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా న్యూఢిల్లీలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అన్‌రిజర్వ్‌డ్ (15), ఎస్‌సీ (03), ఓబీసీ (08), ఈడబ్ల్యూఎస్ (03) పోస్టులు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతోపాటు లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 27 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది సీనియర్ మేనేజర్, మెయిల్ మోటర్ సర్వీస్, సీ-121, నారియాన, న్యూఢిల్లీ, 110028 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 21-01-2022న ప్రారంభమవుతుండగా, 15-03-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Sanjay Raut: ఆ విషయంలో కూడా ఈడీ ఇలానే దర్యాప్తు చేస్తుందా.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
Sanjay Raut: ఆ విషయంలో కూడా ఈడీ ఇలానే దర్యాప్తు చేస్తుందా.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..