ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గతంలో విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 4వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా.. తాజా ప్రకటనతో దరఖాస్తు గడువు నవంబర్ 18వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం కల్పించినట్లైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి లా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, గ్రాడ్యుయేషన్/ఎంబీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లో కనీసం కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు నవంబర్ 4, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ముగింపు తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.69,810ల జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.