Income Tax Dept Jobs: ఆదాయపు పన్ను శాఖలో 291 ఎంటీఎస్‌, టాక్స్ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేంద్ర కొలువు

|

Dec 27, 2023 | 1:51 PM

ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్.. ఎంటీఎస్‌, టాక్స్ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో), టాక్స్ అసిస్టెంట్ (టీఏ), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌), క్యాంటీన్ అటెండెంట్ (సీఏ) పోస్టులను భర్తీ చేయనున్నారు..

Income Tax Dept Jobs: ఆదాయపు పన్ను శాఖలో 291 ఎంటీఎస్‌, టాక్స్ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేంద్ర కొలువు
Income Tax Deparment
Follow us on

ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్.. ఎంటీఎస్‌, టాక్స్ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో), టాక్స్ అసిస్టెంట్ (టీఏ), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌), క్యాంటీన్ అటెండెంట్ (సీఏ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా – పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్‌బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, వెయిట్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్, క్వాష్‌, సాఫ్ట్‌ టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టును బట్టి పదో తరగతి, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌ పోస్టులకు జనవరి 1, 2023 నాటికి 18-30 ఏళ్లు, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు 18-27 ఏళ్లు. టాక్స్ అసిస్టెంట్‌ పోస్టులకు 18-27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టులకు 18-25 ఏళ్లు, క్యాంటీన్ అటెండెంట్‌ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌లో జనవరి 19, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.200 చొప్పున చెల్లించాలి. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్తాలు చెల్లిస్తారు.

జీత భత్యాల వివరాలు

  • క్యాంటీన్ అటెండెంట్/ ఎంటీఎస్‌ పోస్టులకు నెలకు: రూ.18,000 నుంచి 56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.
  • స్టెనోగ్రాఫర్/ ట్యాక్స్ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు: రూ.25,500 నుంచి 81,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌ పోస్టులకు నెలకు: రూ.44,900-1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు..

  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు
  • టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌): 137 పోస్టులు
  • క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు

మరిన్ని వివరాలకు క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.