APPSC Group 2 Jobs: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఐచ్ఛికాల ఎంపికకు అవకాశం

గ్రూప్‌ 2 సర్వీసు పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. గ్రూప్‌ 2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు ఇటీవల కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరితగతిన చర్యలు చేపట్టింది. పోస్టుల ప్రాధాన్యాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి మరోసారి ఐచ్ఛికాలను..

APPSC Group 2 Jobs: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఐచ్ఛికాల ఎంపికకు అవకాశం
option to reject posts for APPSC Group 2 candidates

Updated on: Jan 03, 2026 | 8:33 AM

అమరావతి, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 2 సర్వీసు పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. గ్రూప్‌ 2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు ఇటీవల కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరితగతిన చర్యలు చేపట్టింది.
పోస్టుల ప్రాధాన్యాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి మరోసారి ఐచ్ఛికాలను స్వీకరించాలని కమిషన్‌ భావించింది. వీటితోపాటు ఇప్పటికే మరో ఆప్షన్‌ను కూడా అభ్యర్ధుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే డీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు నాన్‌ విల్లింగ్‌ ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఇతర ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు గ్రూప్‌ 2 పోస్టు వద్దని వెబ్‌సైట్‌లోని నాన్‌ విల్లింగ్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, సమర్పించొచ్చని సూచించింది.

ఈ మేరకు జనవరి నాలుగో తేదీ రాత్రి 10 గంటలలోపు వీటిని సమర్పించాలని కోరింది. ఇది పూర్తిగా ఐచ్ఛికమేనని, తప్పనిసరి కాదని వెల్లడించింది. మరోవైపు గ్రూప్‌ 2లో పోస్టుల ప్రాధాన్యంకి సంబంధించి ఐచ్ఛికాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇవ్వాలని కమిషన్‌ నిర్ణయించింది. అనంతరం ఎంపిక జాబితాను విడుదల చేయాలని ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్‌ 1 క్రీడాకోటా కింద అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 7న సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఏపీలో తొలిసారి పారా మెడికల్‌ విద్యార్థులకూ సప్లిమెంటరీ పరీక్షలు షురూ

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తొలిసారిగా పారా మెడికల్ కోర్సు విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది. రెండేళ్ల డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారు పరీక్షల్లో అనుత్తీర్ణులైతే వార్షిక పరీక్షల సమయంలోనే సప్లిమెంటరీ పరీక్షలు కూడా రాసేవారు. దీని వల్ల విద్యార్ధులకు ఏడాదంతా నష్టపోతున్నారు. దీంతో 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సప్లిమెంటరీ షెడ్యూల్‌ జారీ చేశారు. ఫెయలైన విద్యార్థులు జనవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలను ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.