ఉద్యోగన్వేషణలో ప్రతి వ్యక్తి ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉంటారు. ఒక్కో ఇంటర్వ్యూది ఒక్కో ప్రత్యేకత. ఉద్యోగ స్వరూపాన్ని బట్టి.. అప్పటి పరిస్థితులపై ఇంటర్వ్యూ ఆధారపడి ఉంటుంది. చాలా మందికి ఇంటర్వ్యూ అంటే ఓ రకమైన భయం ఉండటం సహజం. కొంతమంది అయితే ఎటువంటి ప్రశ్నలడుగుతారో అంటూ తెగ ప్రిపేర్ అయిపోతారు. తీరా వెళ్లిన తర్వాత మనం ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. కాని ప్రతి ఇంటర్వ్యూలో కామన్ గా పరిశీలించే అంశాలు కొన్ని ఉంటాయి. మన విషయ పరిజ్ఞానానికంటే ముందుగా మనలో లక్షణాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానికోసం మనతో చాలా క్యాజువల్ గానూ మాట్లాడతారు. ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొంత మంది పక్కా ప్లాన్ తో వెళ్తారు. మరికొంతమంది మాత్రం చేతులు ఊపుకుంటూ ఖాళీ చేతులతో ఇంటర్వ్యూకి వచ్చామంటూ వెళ్లిపోతూ ఉంటారు. అంటే కొంతమంది ఇంటర్వ్యూని సీరియస్ గా తీసుకోరు. అది చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలను చాలా సీరియస్ గా తీసుకోవాలి.
ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే మనకు సంబంధించిన బయోడెటా (రెజ్యుమ్)ను తప్పకుండా ముందే ప్రిపేర్ చేసుకోవాలి. రెజ్యుమ్ లో ఎటువంటి తప్పులు లేకుండా మనకు సంబంధించిన విషయాలన్ని కవర్ అయ్యేలా చూసుకోవాలి. మన విద్యార్హతలతో పాటు ఇప్పటివరకు మనం ఏదైనా సంస్థలో పనిచేశామా లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం లాంటివి చేశామా అనే డీటెయిల్స్ రెజ్యుమ్ లో ఉండేలా చూసుకోవాలి. మరొకటి మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ తప్పకుండా రెజ్యుమ్ లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకు కమ్యూనికేషన్ అందించడానికి మన మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక్కోసారి ఫోన్ పనిచేయకపోయినా.. మన ఈ మెయిల్ కు కమ్యూనికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే దానిని స్పష్టంగా రెజ్యుమ్ లో పేర్కొనాలి. వృత్తి పరమైన నైపుణ్యాన్ని తప్పకుండా పేర్కొనాలి.
ఎక్స్ పీరియన్స్ విషయంలో కొంత మంది ఎక్కువుగా చేసే పొరపాటు.. ఉన్న అనుభ వం కంటే ఎక్కువుగా పేర్కొంటారు. కొన్ని సందర్భాలో నిశితంగా పరిశీలిస్తే మనం పేర్కొన్న అనుభవం సరైనదా లేదా ఫేక్ నా అనేది అవతలివారికి ఈజీగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. దీంతో మనపై విశ్వాసం ముందుగానే పోతుంది. మన ఆ ఉద్యోగానికి అన్ని విధాలా అర్హులైనప్పటికి.. కొన్ని సందర్భాల్లో మనం తప్పుడు సమాచారం ఇస్తే అది మనకు వేటు చేసే అవకాశం ఎక్కువ. అందుకే రెజ్యుమ్ లో పేర్కొన్న ప్రతి అంశం ఫర్ ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. మరొక ముఖ్యమైన అంశం ఇప్పుడు చాలా ఇంటర్వ్యూల్లో మన డీటెయిల్స్ తో పాటు మన ఫ్యామిలీ, సోషల్ బ్యాక్ రౌండ్ ఏమిటనేది తప్పనిసరిగా అడుగుతున్నారు. ఈవిషయాలు మన రెజ్యుమ్ లో పొందుపర్చనప్పటికి.. ఆవిషయాలు తప్పనిసరిగా అడుగుతారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కంగారు పడకుండా సమాధానం చెప్పడానికి ప్రిపేర్ అయి వెళ్లాల్సి ఉంటుంది.
ఇక అత్యంత ముఖ్యమైన విషయం సమయపాలన. ఇంటర్వ్యూ ఏ సమయానికి ఉంది. సంబంధిత కంపెనీ వారు ఏ సమయానికి రమ్మన్నారు అనేది చాలా ముఖ్యం. వారు పిలిచిన సమయానికి కంటే ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైతే నిర్ణీత సమయానికి ఓ 15 నుంచి 20 నిమిషాలు ముందుగా అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎక్కువుగా ఉండేటట్లు అయితే మనం ఇంటి నుంచి బయలుదేరే సమయాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన సమయపాలనను కూడా పరిశీలించే ఛాన్సెస్ ఎక్కువుగా ఉంటాయి. వారు పిలిచిరన సమయం కంటే ఆలస్యంగా వెళ్తే మన మీద సదాభిప్రాయం కలిగే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఇంటర్వ్యూకు ఎక్కువ మంది వచ్చేటట్లు అయితే ముందుగా వెళ్లిన వారిని ఇంటర్వ్యూకు ముందుగా పిలిచే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూల ప్రారంభంలో ఇంటర్వ్యూ చేసే ప్యానల్ కి ఎక్కువ ఓపిక ఉంటుంది. దీంతో మొదట్లో చేసే ఇంటర్వ్యూలు ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు.. ఆసక్తిగా ఉంటాయి. ఇక ఇంటర్వ్యూలో సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అడుగుతారు. మనం ఊహించినవి దాదాపు మనకు ఎదురుకాకపోవచ్చు. అయితే వారు ఎలాంటి ప్రశ్న అడిగిన తడుముకోకుండా మనం సమాధానం చెప్పాలి. ఒక వేళ ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేయడం ఉత్తమం. అలా కాకుండా మనకు తెలియకపోయినా.. తెలిసినట్లు ఏదో చెబుదామన్నట్లు నటిస్తే మన నటను అవతలివారికి ఈజీగా తెలిసిపోతుంది. అందుకే సమాధానం తెలిస్తే వెంటనే సమాధానం చెప్పడం, తెలియకపోతే తెలియదని చెప్పడం ఉత్తమం.
మరో ముఖ్యమైన అంశం ఇంటర్వ్యూ సమయంలో మనల్ని ఇంటర్వ్యూ చేసే ప్యానల్ వైపు మనం చూడటం, మన ఫేస్ ఎఫియరెన్స్ చాలా ముఖ్యం. మనల్ని ప్రశ్నలు అడిగేటప్పుడు. . మనం ఇంటర్వ్యూ ప్యానల్ వైపు కాకుండా పక్కకు చూడటం ద్వారా మనపై సదాభిప్రాయం ఉండకపోవచ్చు. ఇంకో అంశం మనం ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఎలా వెళ్తున్నాం అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. డీసెంట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం. అలాగే శుభ్రంగా ఉండే బట్టలు.. మాసిపోకుండా ఉన్నవి వేసుకుని వెళ్లాలి. గెడ్డం లాంటివి ఎక్కువుగా పెంచుకోకుండా.. క్లీన్ సేవింగ్ చేయించుకుని వెళ్లడం ద్వారా మనకు కొన్ని మార్కులు ఎక్కువ పడే అవకాశం ఉంది. అందుకే ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మనం ఎలాంటి దుస్తులు వెసుకెళ్తున్నాం, ఎలా రెడీ అయి వెళ్తున్నాం అనేది గమనంలో పెట్టుకోవాలి. ఇలాంటి విషయాలన్ని దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా ఈవిషయాలన్ని మనకు ఇంటర్వ్యూలో ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.