IIT JAM 2022 response sheets Released: ఎమ్మెస్సీలో ప్రవేశాలకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (JAM 2022)కు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను, ప్రశ్న పత్రాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) బుధవారం (ఫిబ్రవరి 16) విడుదల చేసింది. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ – మొత్తం ఏడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్న పత్రాలు అధికారిక వెబ్‌సైట్ jam.iitr.ac.inలో విడుదలయ్యాయి. ఈ ఏడు పేపర్లకు సంబంధించిన జామ్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తడానికి ఐఐటీ అభ్యర్థులకు అనుమతినిస్తూ ఐఐటీ రూర్కీ ప్రకటన వెలువడించింది. JAM JOAPS నుంచి అభ్యంతరాల (objections)ను తెల్పవచ్చు. ఐతే ప్రతి అభ్యంతరానికి రుసుము చెల్లించవల్సి ఉంటుంది. అబ్జెక్షన్స్‌తోపాటు సపోర్ట్ డాక్యుమెంట్‌ను కూడా తప్పనిసరిగా సబ్‌మిట్ చెయ్యవల్సి ఉంటుంది. జామ్ ఆన్సర్ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. వీటిల్లో చెల్లుబాటు అయ్యే అభ్యంతరాల ఆధారంగా, జవాబు కీని తయారుచేస్తారు. పునరుద్ధరణల అనంతరం తుది ఆన్సర్ కీ విడుదల అవుతుంది. దీని ఆధారంగానే ఫైనల్ రిజల్ట్స్ విడుదలవుతాయి.
IIT JAM 2022 రెస్పాన్స్ షీట్లు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
IIT JAM 2022 క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
Also Read: