తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
* సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజినీరింగ్, వర్క్‌షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ డిప్లొమా/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్క్రీనింగ్/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 10-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..