JoSAA Orientation Schedule 2025: జోసా ఐఐటీ ఓరియంటేషన్‌ షెడ్యూల్‌ విడుదల.. జులై 28 నుంచి క్లాసులు షురూ

దేశంలోని మొత్తం 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఓరియంటేషన్‌, తరగతుల ప్రారంభంపై జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (JoSAA) దృష్టి సారించింది..

JoSAA Orientation Schedule 2025: జోసా ఐఐటీ ఓరియంటేషన్‌ షెడ్యూల్‌ విడుదల.. జులై 28 నుంచి క్లాసులు షురూ
IIT Orientation and Class Schedule

Updated on: Jul 03, 2025 | 5:49 PM

హైదరాబాద్‌, జులై 3: దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఓరియంటేషన్‌, తరగతుల ప్రారంభంపై జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (JoSAA) దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు జోసా అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచింది. ఆయా ఐఐటీల్లో అడ్మిషన్‌ పొందిన విద్యార్ధులు ఎప్పుడు రిపోర్టింగ్‌ చేయాలి? రిజిస్ట్రేషన్‌, ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌, అకడెమిక్‌ సెషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ షెడ్యూల్‌లో పొందుపరిచింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం.. దాదాపు అధిక ఐఐటీల్లో జులై 28 నుంచి ఆగస్టు 5 మధ్య తేదీల్లోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు క్యాంపస్‌, అకడమిక్‌ వాతావరణాన్ని పరిచయం చేసేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఓరియంటేషన్‌ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు జోసా ఈ షెడ్యూల్‌లో పేర్కొంది. అయితే, విద్యార్థులు రిజస్ట్రేషన్ల ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు, ఓరియంటేషన్‌ నిబంధనలు వంటి వివరాలను అందులో పేర్కొనలేదు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత ఐఐటీ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని సూచించింది.

JoSAA ఓరియంటేషన్‌ షెడ్యూల్‌ 2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ప్రారంభమైన ‘స్టడీ అవర్‌’ క్లాసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ‘స్టడీ అవర్‌’ క్లాసులు ప్రారంభమైనాయి. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ క్లాసులు నిర్వహించనున్నారు. జులై 2 నుంచి ఇవి ప్రారంభమైనాయి. ఈ మేరకు మండల విద్యాధికారులు రోజుకో పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి నివేదికను పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జులై మూడో వారంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు, ఆగస్టు 4 నుంచి ఫార్మెటివ్‌ 1 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.