IIT Hyderabad: టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్న హైదరాబాద్‌ ఐఐటీ.. ఏ స్థానంలో నిలిచిందో తెలుసా.?

|

Dec 30, 2021 | 8:36 AM

IIT Hyderabad: దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలు అనగానే మొదటగా గుర్తొచ్చేవి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు. ఈ విద్యాసంస్థల్లో సీటు దక్కించుకోవాలనేది సదరు భారతీయ విద్యార్థుల లక్ష్యంగా చెబుతుంటారు..

IIT Hyderabad: టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్న హైదరాబాద్‌ ఐఐటీ.. ఏ స్థానంలో నిలిచిందో తెలుసా.?
Follow us on

IIT Hyderabad: దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలు అనగానే మొదటగా గుర్తొచ్చేవి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు. ఈ విద్యాసంస్థల్లో సీటు దక్కించుకోవాలనేది సదరు భారతీయ విద్యార్థుల లక్ష్యంగా చెబుతుంటారు. ఇలాంటి అత్యున్నత విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అటల్‌ ఇన్నోవేషన్‌ ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. 2021 ఏడాదికిగాను ప్రకటించిన ఈ జాబితాలో ఐఐటీ హైదరాబాద్‌ టాప్‌టెన్‌లో నిలవడం విశేషం. ఈసారి ఐఐటీ హైదరాబాద్‌ ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

బుధవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సుభాష్‌ సర్కార్‌ ఈ ర్యాంకులను ప్రకటించారు. వినూత్న సాంకేతిక ఆవిష్కరణల అంశంలో ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ఐఐటీ మద్రాస్‌ వరుసగా మొదటి స్థానం దక్కించుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ రూర్కీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిలిచాయి.

ఇక సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌ టాప్‌టెన్‌లో చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని అధ్యాపకులు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ 2018లో ఏఆర్‌ఐఐఏ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఏటా ర్యాంకులను ప్రకటిస్తున్నది. గతేడాది 19వ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ ఇప్పుడు 7వ స్థానం దక్కించుకోవడం విశేషం.

Also Read: ICC Awards: టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ జాబితాలో చేరిన ‘ఆ నలుగురు’.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు

Thaman S: అందుకే బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు..! ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్..(వీడియో)

Telangana High Court: ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి..  ఇళ్ల మధ్య పబ్‌లపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు..