IIT Delhi jobs 2022: నెలకు రూ.79వేల జీతంతో.. ఐఐటీ ఢిల్లీలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Mar 07, 2022 | 8:22 AM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Delhi) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల (Project Scientist Posts) భర్తీకి..

IIT Delhi jobs 2022: నెలకు రూ.79వేల జీతంతో.. ఐఐటీ ఢిల్లీలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Iit Delhi
Follow us on

IIT Delhi Project Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Delhi) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల (Project Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టులు: ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అటెండెంట్‌ పోస్టులు.

  • ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: 5

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

పే స్కేల్: నెలకు రూ.79,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: 4

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

పే స్కేల్: నెలకు రూ.63,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • ప్రాజెక్ట్‌ అటెండెంట్‌: 1

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే లేజర్‌ కట్టింగ్‌, 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.28,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ అడ్రస్‌: crfiitdrecruitment@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

MANIT jobs 2022: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..