
హైదరాబాద్, మార్చి 26: వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోని యూనివర్సిటీలు సత్తీ చాటాయి. 100కు పైగా దేశాల్లోని మొత్తం 1900 విద్యా సంస్థలతో రూపొందించిన ఈ జాబితాలో 55 విభాగాలు, 5 ఫ్యాకల్టీ రంగాలకు చెందిన 21 వేలకుపైగా అకడమిక్ ప్రోగ్రామ్‌లను బెంచ్‌మార్క్ చేస్తాయి. ఇందులో దేశంలోనే అగ్రశ్రేణి ఇంజినీరింగ్ విద్యా సంస్థగా పేరుగాంచిన ఐఐటీ ఢిల్లీ టాప్ 50లో చోటు దక్కించుకుంది. ఎలక్ట్రికల్ (36), మెకానికల్ (44), కంప్యూటర్ సైన్స్ (45), కెమికల్ ఇంజినీరింగ్ (48) విభాగాల్లో అత్యుత్తమ గ్లోబల్ ర్యాంకులు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 ర్యాంకుల్లో భారత్‌కు చెందిన ఏకంగా 27 విద్యాసంస్థలు చోట దక్కించుకోవడం విశేషం. ఐఐటీ బాంబే, ఖరగ్‌పూర్, మద్రాస్, జేఎన్‌యూ, బిట్స్ పిలానీ వంటి సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ విభాగాల్లో ఐఐఎం అహ్మదాబాద్ ప్రపంచ స్థాయిలో 21వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఇక మైనింగ్ ఇంజినీరింగ్‌లో ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ 21వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్స్‌లో తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీ హెచ్) సైతం మరోసారి సత్తా చాటింది. 2026 సంవత్సరా నికి సంబంధించి ఇంజనీరింగ్, టెక్నాలజీ యూని వర్సిటీల ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్ ప్రపంచంలోనే 395వ ర్యాంకు సాధించింది. గతేడాది (2025) ఈ సంస్థ 501 నుంచి 550 ర్యాంకింగ్ మధ్యలో ఉండగా ఒక్క ఏడాదిలోనే ఏకంగా వంద ర్యాంకులు ఎగబాకి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఆరు ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రపంచంలోనే టాప్ 300లో నిలిచింది. మొత్తం 9 సబ్జెక్టుల్లో చోటు సంపాదించింది.
కాగా బ్రిటన్‌కు చెందిన క్వాకరెల్లి సైమండ్స్ అనే సంస్థ యేటా క్యూఎస్ ర్యాంకింగ్‌లు ఇస్తుంది. ఆయా వర్సిటీల అకడమిక్స్, పరిశోధనలు వంటి తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇక ఈ ర్యాంకిగ్స్‌లో హెచ్‌సీయూకు అంతర్జాతీయంగా 7 సబ్జెక్టుల్లో గుర్తింపు దక్కింది. లింగ్విస్టిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయో లాజికల్ సైన్సెస్ సబ్జెక్టుల్లో ర్యాంకులు వచ్చాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.