Free Coaching: ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోన్న ఐఐటీ బాంబే.. ఎలా అప్ల‌య్ చేసుకోవాలంటే..

|

Apr 29, 2021 | 12:42 PM

Free Coaching: ప్ర‌స్తుతం విద్యార్థులంతా క‌రోనా కార‌ణంగా విద్యా సంస్థ‌లు మూత‌ప‌డ‌డంతో ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. మ‌రి ఈ ఖాళీ స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ఆన్‌లైన్‌లో ఏదైనా కోర్సు నేర్చుకుంటే...

Free Coaching: ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోన్న ఐఐటీ బాంబే.. ఎలా అప్ల‌య్ చేసుకోవాలంటే..
Online Course Iit Bombay
Follow us on

Free Coaching: ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా విద్యా సంస్థ‌లు మూత‌ప‌డ‌డంతో విద్యార్థులంతా ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. మ‌రి ఈ ఖాళీ స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ఆన్‌లైన్‌లో ఏదైనా కోర్సు నేర్చుకుంటే కెరీర్‌కు ఉప‌ప‌యోగ‌ప‌డుతుంది క‌దూ.. అయితే ఆన్‌లైన్ కోర్సుల‌కు కూడా ఇటీవ‌ల బాగా ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే దేశంలోనే ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల్లో ఒక‌టైనా ఐఐటీ బాంబే ఆన్‌లైన్ కోర్సుల‌ను అందిస్తోంది. పీహెచ్‌పీ, మై ఎస్‌క్యూఎల్ కోర్సుల‌ను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ కోర్సుల‌ను నేర్చుకోవాల‌ని ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు స్వ‌యం (SWAYAM) ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* ముందే రికార్డు చేసి ఉండే ఈ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ‌)ను ఏఐసీటీఈ ఆమోదించింది.
* 15 వారాల గ‌డువుల్లో పూర్త‌య్యే ఈ కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ వీడియో, ఆడియో ఫార్మాట్లలో అందుబాటులో ఉంది.
* పీహెచ్‌పీ ప్రోగ్రామ్‌ లాంగ్వేజ్‌ను నేర్చుకునేందుకు అవసరమైన 57 ఆడియో, వీడియో రూపంలో పాఠ్యాంశాలు ఉన్నాయి.
* వెబ్‌సైట్ డిజైన్ కోసం పీహెచ్‌పీ లాంగ్వేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
* ఈ కోర్సుల‌కు సాఫ్ట్‌వేర్‌ యూజర్లు, డెవలపర్లు, ట్రైనర్లు, రిసెర్చ్‌ స్కాలర్లు, ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు, యూజీ, పీజీ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
* ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://onlinecourses.swayam2.ac.in/లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

Also Read: Covid-19 Second Wave: భారత్ నుంచి త్వరగా వచ్చేయండి.. దేశస్థులకు అలర్ట్ జారీ చేసిన అమెరికా

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. ఇక నుంచి సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం.. ఎందుకంటే..!

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.